ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పగలు టీడీపీతో.. రాత్రి వైసీపీతో తిరిగే వారు మారండి

ABN, First Publish Date - 2022-02-13T06:44:50+05:30

పగలు టీడీపీతో.. రాత్రి వైసీపీ వారితో తిరిగే వారు మారాలని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పులివర్తి నాని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పులివర్తినాని - రామచంద్రాపురంలో టీడీపీ కార్యకర్తల మోటార్‌ సైకిల్‌ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్యకర్తల సమావేశంలో పులివర్తినాని 


రామచంద్రాపురం, ఫిబ్రవరి 12: పగలు టీడీపీతో.. రాత్రి వైసీపీ వారితో తిరిగే వారు మారాలని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పులివర్తి నాని సూచించారు. రామచంద్రాపురం మండలం మిట్టూరు కమ్యూనిటీ భవనంలో శనివారం మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు ఎన్నికల ముందువరకు కొట్టుకున్నా, ఎన్నికలప్పుడు ఒక్కటై పోరాటం చేస్తారన్నారు. అదే టీడీపీలో ఎన్నికల ముందు వరకు కలిసుండి.. ఆపై లేనిపోని విబేధాలతో విడిపోతారన్నారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా అందరి సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా  కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. జగన్‌ పాలనతో అన్ని వర్గాలు విసిగిపోయాయన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక రెండున్నరేళ్లుగా వైసీపీ నాయకులు తిరుగుతున్నారని , అటువంటి వారి చుట్టూ తిరిగి ప్రయోజనం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులకు 12శాతం వడ్డీతో బిల్లులు మంజూరు చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు ఆర్సీపురం మండల సరిహద్దుల్లో నుంచి వందలాది మంది కార్యకర్తలు చేపట్టిన స్కూటర్‌ర్యాలీని నాని జెండా ఊపి ప్రారంభించారు. అన్నా మీవెంట మేమున్నాం, ప్రాణాలైనా అర్పించి గెలిపిస్తామంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చినబాబు, జిల్లా నాయకులు ఉమాపతినాయుడు, జనార్దన్‌చౌదరి, ఢిల్లీనాథరెడ్డి, హరిప్రసాద్‌, ధనంజయరెడ్డి, సుబ్రహ్మణ్యంయాదవ్‌, మండల నాయకులు గిరినాయుడు, విజయ్‌కుమార్‌, మునెయ్య, వెంకటప్రసాద్‌, గిరిధర్‌రెడ్డి, దాదాసాహేబ్‌, గుణసుందరి, జయచంద్రనాయుడు, గోపి, రవి, చిరంజీవి, మురళీనాయుడు, ప్రభాకర్‌, గరుడాద్రినాయుడు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్తూరి రెడ్డెప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-13T06:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising