పోలీసుల అదుపులో సబ్ రిజిస్ట్రార్?
ABN, First Publish Date - 2022-10-08T05:12:11+05:30
చిత్తూరులోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను, మరో ఇద్దరు వీఆర్వోలను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మరో ఇద్దరు వీఆర్వోలు కూడా!
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 7: చిత్తూరులోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను, మరో ఇద్దరు వీఆర్వోలను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విధినిర్వహణలో ఉండగా పోలీసు అధికారులు కార్యాలయానికి వచ్చి అక్కడే వున్న ఉన్నతాధికారిణి, మార్కెట్ వ్యాల్యూ, ఆడిట్ ఉమ్మడి జిల్లాల రిజిస్ట్రార్ ఉషారాణిని కలిసి వివరాలు అందించారు. చిత్తూరు నగరంలో నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో కొందరిపై కేసులు నమోదుచేసి విచారణ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విచారణ నిమిత్తం చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన్ను పోలీసు అధికారులు నకిలీ పత్రాల రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కొన్ని గంటల పాటు రహస్యంగా విచారించినట్లు తాజాగా తెలియవచ్చింది. సబ్ రిజిస్ట్రార్‌ను, వీఆర్వోలను అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది ఆందోళనలో పడ్డారు. ఈ విషయాన్ని అధికారపూర్వకంగా ఎవరూ నిర్ధారించడంలేదు.
Updated Date - 2022-10-08T05:12:11+05:30 IST