ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల విలీనంతో విద్యార్థులకు తీరని నష్టం

ABN, First Publish Date - 2022-04-25T05:22:39+05:30

రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహనదాస్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌దాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 24: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహనదాస్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని యూత్‌ హాస్టల్లో ఆదివారం ఆ సంఘం తిరుపతి జిల్లా నూతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల విలీనానికి సంబంధించిన మెమరాండంను రద్దు చేయాలన్నారు. కిలో మీటర్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరాన్ని పెంచుతూ జారీచేసిన జీవోను ఆపాలని కోరారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20గా, ఉన్నత పాఠశాలలో తరగతికి 40మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ ఏర్పాటుచేసి సమాంతరం మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్‌ పరిధిలో విద్యార్థులు ప్రాథమిక విద్యను పూర్తిచేయాల్సి ఉందని గుర్తు చేశారు. అలాగే పాఠశాలల పునఃప్రారంభంలోపు ఖాళీగా ఉన్న 25వేల టీచర్‌ పోస్టులను భర్తీచేయాలని, వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సుబ్బారావు, చిరంజీవి, మహమ్మద్‌రఫి, ఆనందనాయుడు, సుబ్బారెడ్డి, కిరణ్‌, నాదముని, వెంకటముని, నరేంద్ర, పార్వతి పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-04-25T05:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising