ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంతుకోసి.. ప్రాణం తీసి

ABN, First Publish Date - 2022-12-07T00:04:44+05:30

చిత్తూరులో ఆటో డ్రైవర్‌ వడివేలు(40)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. సోమవారం మధ్యాహ్నం ఫోను రావడంతో ఇంటి నుంచి వెళ్లిన ఇతడు.. మంగళవారం ఉదయం శవమై కనిపించాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ మద్దయ్యఆచ్చారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరులో ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

చిత్తూరు, డిసెంబరు 6: చిత్తూరులో ఆటో డ్రైవర్‌ వడివేలు(40)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. సోమవారం మధ్యాహ్నం ఫోను రావడంతో ఇంటి నుంచి వెళ్లిన ఇతడు.. మంగళవారం ఉదయం శవమై కనిపించాడు. చిత్తూరు తాలూకా సీఐ మద్దయ్య ఆచ్చారి తెలిపిన ప్రకారం.. నగరంలోని జాన్సన్‌ గార్డెన్‌కు చెందిన వడివేలుకు జీడీ నెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన శెల్వితో 2017లో వివాహమైంది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వడివేలు సోమవారం మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. 3.30 గంటల సమయంలో ఫోన్‌ రావడతో బయలుదేరి వెళ్లాడు. మంగళవారం ఉదయం సీతమ్స్‌ కళాశాల ఎదురుగా ఉన్న మట్టిరోడ్డులో రక్తపు మడుగులో అతడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యం తాగినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వడివేలు గొంతుకోసి చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి పరిశీలించారు.

పాత కక్షలా.. వివాహేతర సంబంధమా..?

వడివేలు అన్న బాబును 2001లో మద్యంమత్తులో చోటుచేసుకున్న వాగ్వివాదంతో కొంతమంది బీరు బాటిల్‌తో కొట్టి చంపేశారు. అప్పట్లో జీడీ నెల్లూరు పోలీసులకు వడివేలు కొందరిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారేమైనా కక్ష పెంచుకుని చంపేశారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. లేకపోతే వివాహేతర సంబఽంధమేదైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఒకట్రెండు రోజుల్లో హంతకులను పట్టుకుంటామని తాలూకా సీఐ తెలిపారు.

Updated Date - 2022-12-07T00:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising