ఇలకైలాసం శ్రీకాళహస్తి
ABN, First Publish Date - 2022-01-05T06:36:49+05:30
శ్రీకాళహస్తి క్షేత్రం సాక్షాత్తు ఇలకైలాసమని హిందూ ధార్మికసేవా సమితి వ్యవస్థాపకుడు బాలబ్రహ్మానంద సరస్వతి పేర్కొన్నారు. ధ
శ్రీకాళహస్తి, జనవరి 4: శ్రీకాళహస్తి క్షేత్రం సాక్షాత్తు ఇలకైలాసమని హిందూ ధార్మికసేవా సమితి వ్యవస్థాపకుడు బాలబ్రహ్మానంద సరస్వతి పేర్కొన్నారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన శ్రీకాళహస్తి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా మూగజీవుల భక్తికి మెచ్చి వాటికి పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించడంతోనే శ్రీకాళహస్తికి ముక్తి క్షేత్రంగా పేరొచ్చిందని ఆయన అన్నారు. పుణ్యక్షేత్రం, అటు మూలమూర్తి పేరు ఒక్కటిగా పిలువబడే అరుదైన ప్రాంతం ఇదేనని గుర్తుచేశారు. శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నారన్న దానికి గర్భాలయంలో ప్రతిస్పందించే వాయుదీపాలే సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-05T06:36:49+05:30 IST