ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్య కార్యకర్తకి అందలం.. Telugudesam కే సాధ్యం.. ఇదిగో వరుణే సాక్ష్యం..!

ABN, First Publish Date - 2022-01-13T18:08:16+05:30

తెలుగుదేశంలో యువరక్తం నింపడం మొదలుపట్టారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుదేశంలో యువరక్తం నింపడం మొదలుపట్టారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణే తెలుగు యువత  కొత్త కమిటీ కూర్పు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కంకణబద్ధులైన యువతకు, ప్రజాసమస్యలపై విశ్రమించకుండా పోరాడే నాయకులకు బాధ్యతలు అప్పగించింది. అందులో ఒకరే చిత్తూరుకు చెందిన వరుణ్. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన ఎంపికయ్యారు. వరుణ్ గతంలో చిత్తూరు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా, విద్యార్థి జేఏసీకి అధ్యక్షుడిగా పనిచేశారు.


చిత్తూరు జిల్లా : విద్యార్థి నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా, ప్రజాసమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న యువనేతగా వరుణ్‌కి పేరుంది. సుశిక్షతలైన కార్యకర్తల నుంచి నాయకులను తయారుచేయడంలో ముందుండే పార్టీగా పేరున్న టీడీపీ తయారుచేసిన మరో యువ నేత వరుణ్. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, అందరినీ కలుపుకొనిపోయే వ్యక్తిగా జిల్లాలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. చిత్తూరులోని ప్రత్యర్థి పార్టీల వాళ్లు సైతం వరుణ్‌ని ఎంతో గౌరవిస్తూ ఉంటారు.




కోవిడ్ తొలి దశ నుంచి..

కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి కూడా వరుణ్ చాలా ఉద్ధృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తను మాత్రమే కాకుండా  తన స్నేహితులను ఈ సేవా యజ్ఞంలో పాలుపంచుకునేలా చేశారు. బెంగళూరులోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండే తను, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరికో అండగా నిలిచారు. తాను పుట్టి పెరిగిన చిత్తూరులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఆత్మబంధువు అయ్యారు. ఈ క్రమంలోనే సోనూసూద్ దృష్టిని సైతం వరుణ్ ఆకర్షించ కలిగారు. సూద్ ఫౌండేషన్ వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ఈయన మద్దతుగా, సహాయకారిగా నిలిచారు. కొవిడ్ తొలి దశ నుండి అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వరుణ్ పలుమార్లు పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు.


ప్రజా సమస్యలపై సామాజిక మధ్యమాలలో, క్షేత్ర స్థాయిలో పోరాడుతున్న వరుణ్‌కి రాష్ర్ట స్థాయిలో పదవి దక్కడం ఎంతో సంతోషంగా ఉందని చిత్తూరులోని పలువురు తెలుగుదేశం కార్యకర్తలు, సహచరులు అభిప్రాయపడ్డారు. తెదేపాలో కార్యకర్త కంటే గొప్ప పదవీ ఏదీ లేదని, వచ్చింది ఒక బాధ్యత అని, దీని ద్వారా యువతని మరింత సంఘటితం చేసి ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి మరింతగా చేరవేసేందుకు వినియోగించుకుంటానని వరుణ్ అన్నారు.

Updated Date - 2022-01-13T18:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising