ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somu Veerraju: జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది..

ABN, First Publish Date - 2022-09-07T20:07:26+05:30

జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సోము వీర్రాజు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (Tirupathi): రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, జగన్ ప్రభుత్వం (Jagan Govt.) ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju)విమర్శించారు. బుధవారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతన్నల ఆత్మహత్యలకు పురిగొల్పుతోందని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu)కు అధికార యావ తప్ప మరో ధ్యాస లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం దారుణమన్నారు. అధికారులంతా.. వాలంటీర్లులా వ్యవహరిస్తున్నారని, జగన్ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వమని అన్నారు. కేంద్ర నిధులతోనే ఏపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని.. ఇసుక, లిక్కర్, భూ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రహదార్లు దెబ్బతిన్నా... వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న జగన్ సర్కార్ తీరును ఎండగట్టేందుకు బీజేపీ సమాయత్తమయ్యిందని స్పష్టం చేశారు. ఇప్పటికే యాబై సభలను నిర్వహించామని, మరిన్ని సమావేశాలను నిర్వహించి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-07T20:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising