ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహవాహనీ... దుర్జన దూరిణీ!

ABN, First Publish Date - 2022-05-22T06:03:05+05:30

కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ముత్తుమారెమ్మకు అభిషేకాలు నిర్వహించారు.

ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్తుమారెమ్మ మూలవిరాట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, మే 21: కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ముత్తుమారెమ్మకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ప్రసన్న రూపాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సాయంత్రం ముత్తుమారెమ్మకు సింహవాహన సేవ అపురూపంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి సింహవాహనంపై అధిష్ఠింపజేశారు. సింహ వాహనంపై పుర విహారం చేసిన అమ్మవారు దుర్జనుల మదమణిచే దుర్జర రూపంలో కనిపించారు. మహిషాసుర మర్దినిగా కామక్రోధ లోభ మద మాత్సర్యాలనే దుర్గుణ సంహారం చేశారు. వీధులలో బారులు తీరిన భక్తులు ముత్తుమారెమ్మకు కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ముత్తుమారెమ్మ చల్లని చూపులకు పాత్రులయ్యారు.



Updated Date - 2022-05-22T06:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising