ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2022-08-19T06:09:51+05:30

ఆర్టీసీ బస్టాండులో ఖాళీలున్న దుకాణాలను లీజుకివ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 18: ఆర్టీసీ బస్టాండులో ఖాళీలున్న దుకాణాలను లీజుకివ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా డిపోల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల్లోపు దరఖాస్తులను తిరుపతి పీటీడీవో కార్యాలయంలోని ప్రత్యేక బాక్సులో వేయాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు టెండరుదారుల సమక్షంలోనే దరఖాస్తులను తెరుస్తామన్నారు.  మరిన్ని వివరాలకు 73828 78578 నెంబరును సంప్రదించాలని సూచించారు. 


దుకాణాల ఖాళీలిలా.. 

తిరుపతి సీబీఎ్‌సలోని శ్రీహరి బస్టాండులో 19, శ్రీనివాసంలో 11, ఏడుకొండలులో 2, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 10తోపాటు రేడియో స్టేషన్‌ వద్ద ఉన్న అన్నమయ్య బస్టాండులో 1, రేణిగుంటలో 2, రంగంపేటలో 3, చంద్రగిరిలో 1, పుత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 6, పిచ్చాటూరులో 1, ఏర్పేడులో 1, సత్యవేడులో 2, నాగలాపురంలో 3, సూళ్లూరుపేటలో 1, నాయుడుపేటలో 20, కోటలో 6, గూడూరులో 4, వెంకటగిరిలో 3 కలిపి మొత్తం 99దుకాణాలున్నాయి. 


Updated Date - 2022-08-19T06:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising