ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవలు సరే.. జీతాలేవీ..?

ABN, First Publish Date - 2022-08-08T06:27:56+05:30

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన నూతన రెవిన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు వేతన కష్టాలు ఎదురౌతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త ఆర్డీవో కార్యాలయాలకు మంజూరు కాని పోస్టులు 

ఉద్యోగులు, సిబ్బందికి నాలుగు నెలలుగా వేతన కష్టాలు 

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 7: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన నూతన రెవిన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు వేతన కష్టాలు ఎదురౌతున్నాయి. ప్రజలకు సేవలు చేరువౌతున్నప్పటికీ ఉద్యోగులకు వెతలు పెరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి, మదనపల్లెలో ఆర్డీవో కార్యాలయాలు ఉన్నాయి. పునర్విభజనతో కొత్తగా పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తిలో ఈ ఏడాది ఏప్రిల్‌ 4న నూతన ఆర్డీవో కార్యాలయాలు ప్రారంభించారు. ఆర్డీవోతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్లను నియమించారు. వారితో నాలుగు నెలలుగా సేవలు కొనసాగుతున్నాయి. ఒక్కో కార్యాలయానికి ఆర్డీవోతో పాటు నిబంధనలమేర మరో 16 మంది సిబ్బందిని నియమించాల్సి ఉండగా ఆ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్డీవోలతో పాటు ఇతర ఉద్యోగులకు ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు వేతనాలు నేరుగా అందడంలేదు. ఉద్యోగుల నియామకాలు, సేవలకు సంబంధించి పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారపూర్వకంగా ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ఖజానా శాఖ అధికారులు ఆర్డీవో కార్యాలయాలకు మ్యాపింగ్‌ చేసుకోవడంలేదు. దీంతో వారి వేతనాల బిల్లులు ఖజానా కార్యాలయాల్లో స్వీకరించడం లేదు. వారికి సీఎ్‌ఫఎంఎస్‌ లాగిన్‌ అందడం లేదు. వేతనాలు అందని పరిస్థితి ఉండడంతో కొత్త ఆర్డీవో కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఎవరూ సుముఖత చూపడంలేదు. కొందరు వేరే స్థానాల నుంచి బదిలీపై వచ్చి జీతాలందని చోట పని ఎందుకు చేయాలంటూ రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చి బదిలీలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నెలవారీ కుటుంబ ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా కొత్త ఆర్డీవో కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఆర్డీవో కార్యాలయాల ద్వారా సేవలందించే అధికారులు, ఉద్యోగుల సేవలను కేడర్‌ స్ట్రెంథ్‌ను ఖరారుచేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-08T06:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising