ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్మాద పాలనలో మహిళలకు భద్రత కరువు

ABN, First Publish Date - 2022-05-17T07:57:55+05:30

ఉన్మాద పాలనలో మహిళలకు భద్రత లేదని తిరుపతి పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష విమర్శించారు.

కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు మహిళల నిరసన 


తిరుపతి(కొర్లగుంట), మే 16: ఉన్మాద పాలనలో మహిళలకు భద్రత లేదని తిరుపతి పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష విమర్శించారు. సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండు ముందున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు నిరసనగా కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడేళ్లలో 1600మందికిపైగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోగా మహిళా కమిషన్‌, హోంమంత్రి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై సీఎంకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆరోపించారు. మహిళలకు భద్రతా చర్యలు చేపట్టాలని, లేనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చర్చించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఎం.శ్రావణిరెడ్డి, విజయలక్ష్మి, జి.లీలావతి, భార్గవమ్మ, సింధూజ, జి.భారతి, భారతి, అనిత, నాయుడమ్మ, మంజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T07:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising