ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్సీ-98 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం

ABN, First Publish Date - 2022-10-07T06:15:09+05:30

డీఎస్సీ-1998కి ఎంపికై, మినిమం టైం స్కేల్‌ కింద అంగీకారం తెలిపిన 644 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది.

ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న డీఈవో పురుషోత్తం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 6: డీఎస్సీ-1998కి ఎంపికై, మినిమం టైం స్కేల్‌ కింద అంగీకారం తెలిపిన 644 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. చిత్తూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నుంచి ఈనెల 13వ తేది వరకు ఈ ప్రక్రియ జరగనుంది. టీచర్ల బదిలీల అనంతరం డీఎస్సీ 1998 అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ ద్వారా పాఠశాలలు కేటాయించి, నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇక, ఉర్దూ ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్‌ టీచర్లు)ల స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతికి సంబంధించి 17 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన డీఈవో కార్యాలయంలో జరిగింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఖచ్చితంగా ఉండాలని డీఈవో పురుషోత్తం అధికారులను ఆదేశించారు. 

నేడు జడ్పీ యాజమాన్యం ఎస్జీటీలకు.. 

జడ్పీ యాజమాన్యం కింద ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు శుక్రవారం డీఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని డీఈవో పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితా ఆధారంగా తెలియజేసిన అభ్యర్థులు ఈ ప్రక్రియకు హాజరు కావాలన్నారు. 


Updated Date - 2022-10-07T06:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising