ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైస్కూల్‌ స్థలం కబ్జా

ABN, First Publish Date - 2022-10-04T06:06:39+05:30

దసరా శెలవులను అదనుగా చూసుకుని వందేళ్ల చరిత్ర కలిగిన పుత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుత్తూరు, అక్టోబరు 3 : దసరా శెలవులను అదనుగా చూసుకుని వందేళ్ల చరిత్ర కలిగిన పుత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. దాదాపు 80 లక్షల రూపాయల విలువ చేసే ఈ స్థలాన్ని సోమవారం ఎక్స్‌వేటర్‌ చదును చేస్తుండడం చూసి  స్థానికులు అవాక్కయ్యారు.గాలి చెంగమ్మ అనే దానశీలి దాదాపు 25 ఎకరాల మామిడితోట స్థలాన్ని స్కూలుకు వితరణ చేశారు. ఈ స్థలం పుత్తూరు పట్టణానికి దాదాపు కిలోమీటరు దూరంలో వుంది. అయితే మున్సిపాలిటీ పరిధిలోకి ఆ పాఠశాల చేరడంతో ఆ స్థలానికి విలువ పెరిగింది.హైస్కూలుకు చెందిన క్రీడామైదానం ఆగ్నేయ భాగంలో 6.50 సెంట్ల స్థలం అటువైపు స్థలంలోకి చొచ్చుకుని వుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఓ రియల్టర్‌ అటు వైపున్న స్థలాన్ని చదును చేసే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థలాన్ని కూడా కలిపేసుకుని చదును చేస్తున్నాడు.తన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కబ్జాపర్వాన్ని మంత్రి రోజా అడ్డుకుని నాడు-నేడు పథకం కింద ప్రహరీ గోడను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-10-04T06:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising