ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్ర్తోక్తంగా అంకురార్పణ

ABN, First Publish Date - 2022-08-08T06:50:51+05:30

శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరిగింది.

అంకురార్పణ నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం సేనాధిపతిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. తర్వాత సంపంగి ప్రాకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ముందు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. భగవంతుడి ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీవారికి ఆదివారం రాగి గంగాళాలు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన గంజి రమేష్‌ దంపతులు శ్రీవారి హుండీకి ఉపయోగించే రూ.14 లక్షల విలువైన 11 రాగి గంగాళాలను ఆలయ డిప్యూటీఈవో రమే్‌షబాబుకు అందజేశారు. 


Updated Date - 2022-08-08T06:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising