ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఖాతాల్లో రూ.72.41 కోట్లు జమ

ABN, First Publish Date - 2022-10-18T05:23:13+05:30

రెండోవిడత వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలకు సంబంధించి జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.72.41కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, అక్టోబరు 17: రెండోవిడత వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలకు సంబంధించి జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.72.41కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం సీఆర్‌రెడ్డి కళ్యాణ మండపంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వైస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం ద్వారా రెండో విడత నగదు విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో సంవత్సరం రెండో విడత నగదు బదిలీని సీఎం జగన్మోహన్‌రెడ్డి నంద్యాలజిల్లా ఆళ్లగడ్డ నుంచి రైతుల ఖాతాలలోకి జమచేశారన్నారు. తిరుపతి జిల్లాలో 1,74,680 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 4వేలు చొప్పున రూ. 72.41 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అనంతరం వ్యవసాయ అనుబంధశాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, యంత్రపరికరాలను సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్రఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేరిగ మురళీధర్‌రావు, డీసీసీబీ అఽధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లావ్యవసాయ సలహామండలి సభ్యుడు శేషురెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారికి దొరసాని, ఆర్డీవో మురళీకృష్ణ, ఏపీఎంఐపీ అధికారి సతీష్‌, జిల్లా ఉధ్యానవనశాఖ అధికారి దశరథరామిరెడ్డి, ఏడీఏ గోపినాయక్‌, ఏవోలు రమేష్‌, భవానీ, వివిధశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising