ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారానికి రెండ్రోజులైనా సిరి ఽధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలి

ABN, First Publish Date - 2022-01-17T07:12:35+05:30

వారానికి రెండ్రోజులైనా తిరుమలలో శ్రీవారి భక్తులకు సిరి ధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలని సినీనటుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి కోరారు.

నటుడు శ్రీనివాస్‌, టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు, నటుడు భరత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నటుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి


తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వారానికి రెండ్రోజులైనా తిరుమలలో శ్రీవారి భక్తులకు సిరి ధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలని సినీనటుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి కోరారు. టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు, సినీ నటులు పసుకూరి శ్రీనివాస్‌, గుండు రవితేజతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం తినే విధానం మారాలన్నారు. ఇప్పుడు మారకపోతే భాతరదేశంలో తర్వాత తరం ఉండదన్నారు. రాబోవు తరానికి మనం ఇచ్చే బెస్ట్‌ మెడిసిన్‌ సిరిఽధాన్యాలతో ఆహారమన్నారు. ఇండియా తినే విధానాన్ని రాబోవు రెండుమూడేళ్లలో తప్పకుండా మారుస్తామన్నారు. ఇక తమ ‘మిల్లెట్‌ మార్వెల్స్‌’ హోటళ్లను కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. మురంశెట్టి రాములు మాట్లాడుతూ.. సిరిధాన్యాలతో భక్తులకు కనీసం వారంలో ఒక్కసారైనా అన్నప్రసాదాలు అందించేలా ధర్మకర్తల మండలిలో చర్చిస్తామన్నారు. 

Updated Date - 2022-01-17T07:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising