ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామకుప్పంలో రికార్డు స్థాయి వర్షం

ABN, First Publish Date - 2022-05-19T06:23:13+05:30

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 47 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో రామకుప్పం మండలంలో రికార్డు స్థాయిలో 126 మి.మీ.. అత్యల్పంగా తిరుపతి రూరల్‌లో ఒక మిమీ వర్షపాతం నమోదైంది.

వెదురుకుప్పం మండలం మాంబేడు సమీపంలో పడిపోయిన వరి పంటను చూపుతున్న మహిళా రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

126 మి.మీ వర్షపాతం నమోదు 

చిత్తూరు కలెక్టరేట్‌, మే 18:  ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 47 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో రామకుప్పం మండలంలో రికార్డు స్థాయిలో 126 మి.మీ.. అత్యల్పంగా తిరుపతి రూరల్‌లో ఒక మిమీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు  47 మండలాల్లో వర్షం కురిసింది. మండలాల వారీగా.. సదుంలో 95.2, వి. కోటలో 53, సోమలలో 50.2, నిమ్మనపల్లెలో 48.6, పీటీఎంలో 48.2, చిత్తూరులో 47.2, చౌడేపల్లెలో 46.6, పెనుమూరులో 44.2, శాంతిపురంలో  40.2, కలికిరిలో 36, బైరెడ్డిపల్లెలో 35.4, వాయల్పాడులో 31.4, పుంగనూరులో 30.2, ఐరాలలో 30, గుడిపాలలో 29.2, పాకాలలో 27.2, జీడీ నెల్లూరులో 26, రొంపిచెర్లలో 23.2, తంబళ్లపల్లెలో 23, తవణంపల్లెలో 19.6, మదనపల్లెలో 18.8, యాదమరిలో 18.2, ములకలచెరువులో 18, కురబలకోటలో 18, రామసముద్రంలో 17.2, గంగవరంలో 13.6, పెద్దపంజాణిలో 13.6, ఎస్‌ఆర్‌పురంలో 13.4, పలమనేరులో 13.4, వెదురుకుప్పంలో 13, కలకడలో 12.8, బి. కొత్తకోటలో 11, పెద్దమండ్యంలో 10.6, చిన్నగొట్టిగల్లులో 10.4, కుప్పంలో 10 మిమీ చొప్పున.. మిగిలిన 10 మండలాల్లో అంతకంటే తక్కువ వర్షం కురిసింది. ఈ వానతో ఉన్న ఒకటీ అర మామిడి కాయలు నేలరాలాయి. టమోటాలు 15కిలోల బాక్స్‌ రూ.950కు చేరుకున్న సమయంలో పంట దెబ్బతినడం రైతులను ఆవేదనకు గురిచేసింది. రామకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో మామిడి, టమోటా, బీన్స్‌, చిక్కుడు, కాకర తదితర తోటల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో మొక్కలు కుళ్ళిపోయి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెదురుకుప్పం మండలం మాంబేడు ప్రాంతంలో వరి పంటకు నష్టం వాటిల్లింది. 

Updated Date - 2022-05-19T06:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising