ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘోషించిన వేదం..పులకించిన భక్తజనం

ABN, First Publish Date - 2022-03-09T06:59:14+05:30

శ్రీకాళహస్తీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఽశ్రీకాళహస్తీశ్వరాలయంలోని దక్షిణామూర్తి వద్ద, దూర్జటి కళాప్రాంగణంలో వేదం ఘోషించడంతో భక్తజనం పులకించారు. ధూర్జటి కళాప్రాంగణంలో చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్భంగా రాష్ట్ర ప్రముఖ దేవాలయాలకు చెందిన వేదపండితులకు వేద పండిత సభ జరిగింది

ఆలయంలో వేదపఠనంచేస్తున్న పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, మార్చి 8: శ్రీకాళహస్తీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఽశ్రీకాళహస్తీశ్వరాలయంలోని దక్షిణామూర్తి వద్ద, దూర్జటి కళాప్రాంగణంలో వేదం ఘోషించడంతో భక్తజనం పులకించారు. ధూర్జటి కళాప్రాంగణంలో చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్భంగా రాష్ట్ర ప్రముఖ దేవాలయాలకు చెందిన వేదపండితులకు వేద పండిత సభ జరిగింది. ఇందులో భాగంగా శ్రీశైలం, తిరుపతి, కాణిపాకం, పెనుగ్రంచిపోలు, విజయవాడ, అమరావతి, శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన పండితులు వేద పారాయణం చేశారు. ముందుగా ఆలయ ఈవో పెద్దిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి పండిత సభను ప్రారంభించారు. మొత్తం 40మంది పండితులు నాలుగు వేదాలను పఠించారు. వేద శ్రవణంతో భక్తులు పరవశించారు. అనంతరం ఆలయ ఈవో పండితులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంబంధం గురుకుల్‌, కరుణా గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-09T06:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising