ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యం: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-09-08T05:57:34+05:30

జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 7: జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమరనాథ్‌, జయరాములు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 857 పరిశ్రమలు ఏర్పాటుకాగా వీటిలో 37,365 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి 90 రోజుల్లో ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలు తనిఖీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల అధికారి చంద్రశేఖర్‌, కార్మిక శాఖ అధికారి ఓంకార్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శివశంకర్‌, పొల్యూన్‌ కంట్రోల్‌ బోర్డు ఏఈఈ మదన్‌మోహన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-08T05:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising