ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిపందేలపై పోలీసుల దాడి

ABN, First Publish Date - 2022-12-16T01:24:12+05:30

ఏర్పేడు మండలం మాధవమాల పంచాయతీలోని సుండి , రేణిగుంట మండలం సుబ్బయ్యగుంట గ్రామాల సరిహద్దులో మూడు రోజులుగా కోడిపందేలు ఆడుతున్న 9మందిని పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొమ్మిదిమంది అరెస్టు

తప్పించుకునే ప్రయత్నంలో ఒకరి గల్లంతు

ఏర్పేడు/రేణిగుంట, డిసెంబరు 15 : ఏర్పేడు మండలం మాధవమాల పంచాయతీలోని సుండి , రేణిగుంట మండలం సుబ్బయ్యగుంట గ్రామాల సరిహద్దులో మూడు రోజులుగా కోడిపందేలు ఆడుతున్న 9మందిని పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. మూడు కోళ్లు, రూ.4,380 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.అయితే పోలీసు దాడులనుంచి తప్పించుకునేందుకు సుండి గ్రామం నుంచి నలుగురు వ్యక్తులు సుబ్బయ్యగుంట రాళ్లకాలువలోకి దిగారు. ముగ్గురు కాలువ దాటి గట్టుకు వెళ్లగా తిరుపతి నగరం లీలామహల్‌ సర్కిల్‌ సమీపంలోని మాధవనగర్‌కు చెందిన మనోహర్‌ అనే వ్యక్తి గల్లంతయ్యాడు.ఈ సమాచారాన్ని తప్పించుకున్న వారు సమీపంలోని పశువుల కాపర్లకు తెలిపి పారిపోయారు. పశువుల కాపర్లు ఏర్పేడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీహరి సిబ్బందితో ఆ ప్రాంతంలో గురువారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే సరైన సమాచారం అందకపోవడంతో గాలింపు చర్యలు ఎక్కడ చేపట్టాలన్నది ప్రశ్నగా మారిందని డీఎస్పీ రామచంద్ర చెప్పారు.మనోహర్‌ తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టమంటూ గురువారం రాత్రి రేణిగుంట పోలీసులను ఆశ్రయించారు.

Updated Date - 2022-12-16T01:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising