ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుడా టవర్స్‌కు అనుమతులు

ABN, First Publish Date - 2022-10-07T07:18:15+05:30

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) అన్నమయ్య సర్కిల్‌ వద్ద 3.61 ఎకరాల్లో టవర్స్‌ (బహుళ అంతస్తులతో) నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

22వ తేదీలోపు అభ్యంతరాల సేకరణ

తిరుపతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) అన్నమయ్య సర్కిల్‌ వద్ద 3.61 ఎకరాల్లో టవర్స్‌ (బహుళ అంతస్తులతో) నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి పురపాలకశాఖ, పరిపాలన, సాంకేతిక అనుమతులు వచ్చినట్టు తుడా వీసీ హరికృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు బ్లాకులుగా నిర్మించనున్న తుడా టవర్స్‌లో 226 అపార్టుమెంట్లు, 2, 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉంటాయి. వాణిజ్య సముదాయాలు, కార్యాలయపు ఆవరణలు, ప్రజలు కొనుగోలు చేయడానికి, అద్దెకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించిన టెండరు పత్రాలను న్యాయ సమీక్షకు తుడా సమర్పించింది. ఏదైనా అభ్యంతరాలు, సలహాలుంటే ఈనెల 22వ తేదీలోపు జుడీషియల్‌ ప్రివ్యూ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయగలరని వీసీ విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-10-07T07:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising