177 మందికి పింఛన్ నిలిపివేత
ABN, First Publish Date - 2022-08-04T06:21:42+05:30
కరోనా తదితర కారణాలతో జీవించి ఉన్నట్లు అందజేసే లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వనివారికి నాలుగు నెలలుగా పెన్షన్ నిలిచిపోయింది. ఈ మేరకు ప్రభుత్వం ఖజానా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని వారి సంఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 177 మంది ఉన్నట్లు తాజాగా తెలిసింది. వీరికి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల పెన్షన్ మొత్తం అందలేదు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 3: కరోనా తదితర కారణాలతో జీవించి ఉన్నట్లు అందజేసే లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వనివారికి నాలుగు నెలలుగా పెన్షన్ నిలిచిపోయింది. ఈ మేరకు ప్రభుత్వం ఖజానా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని వారి సంఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 177 మంది ఉన్నట్లు తాజాగా తెలిసింది. వీరికి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల పెన్షన్ మొత్తం అందలేదు. ఇదిలావుండగా కరోనా, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కదల్లేని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయలేదు. జీవించి ఉన్నట్లు తెల్పుతూ లైఫ్ సర్టిఫికెట్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి లోగా అందించాల్సి ఉండగా. ప్రభుత్వం ఆ గడువును మార్చి నెలాంతం వరకు పొడిగించింది. గడువు ముగిసే నాటికి 2,500 మంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ అందించలేదు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో 177 మంది తప్ప మిగిలిన వారందరూ అందించారు. వారికి పెన్షన్లు నిలిపివేశారు.
Updated Date - 2022-08-04T06:21:42+05:30 IST