ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో వేతనాలు చెల్లించండి మహప్రభో

ABN, First Publish Date - 2022-08-08T05:01:38+05:30

వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా అతిథి అధ్యాపకుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠ, కు మార్‌ ... ఎమ్మెల్సీ భరత్‌కు విన్నవించారు.

భరత్‌కు వినతిపత్రం అందిస్తున్న అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీకి అతిథి అధ్యాపకుల విన్నపం


కుప్పం, ఆగస్టు 7: వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా అతిథి అధ్యాపకుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠ, కు మార్‌ ... ఎమ్మెల్సీ భరత్‌కు విన్నవించారు. కుప్పంలో ఆదివారం భరత్‌ను కలిసిన అనంతరం వారు  మా ట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 472 జూనియర్‌ కళాశాలల్లో 2012లో కాంట్రాక్ట్‌ లెక్చ రర్లను నిలుపుదల చేసినప్పటినుంచి 9 సంవత్స రాలు అతిథి అధ్యాపకులు (గెస్ట్‌ లెక్చరర్స్‌) పనిచేస్తు న్నారన్నారు. నెలనెలా వేతనం కూడా తమకు రావడంలేదని, ఏడాదికి ఒకమారు మాత్రమే పొం దుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్ల వేతనం ఇవ్వకున్నా పేద విద్యార్థులకోసం విద్యా బోధన చేస్తున్నామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళా శాలల్లో కాంట్రాక్ట్‌, ఎంటీఎస్‌, పార్ట్‌ టైమ్‌ అధ్యాప కులతో సమానంగా పనిచేస్తున్నా తమకు కనీస జీతభత్యాలను కల్పించడంలేదని వాపోయారు. ఏడా దిలో 8 నెలలకు మాత్రం, నెలకు కేవలం రూ.10 వేలు వేతనంగా ఇస్తున్నారన్నారు. ఏడాదికోమారే చేసే ఈ చెల్లింపులవల్ల కుటుంబ పోషణ భారంగా మారి అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంద న్నారు. తెలంగాణలో అతిథి అధ్యాపకులు మెరుగైన వేతనం పొందుతున్నారని చెప్పారు. జగన్‌ ఎన్నిక లకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నపుడు కర్నూలు, నెల్లూరు, విశాఖ పట్టణాలలో కలసి విన్న విస్తే అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరి స్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికా రంలోకి వచ్చి మూడున్నరేళ్లవుతున్నా ఇంతదాకా స మస్యలు పరిష్కరించలేదని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కాం ట్రాక్ట్‌ వ్యవస్థలో విలీనం చేయాలని, ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంనుంచే రెన్యువల్‌ ఇస్తూ 12 నెలల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ... అతిథి అధ్యాపకుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-08-08T05:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising