ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత జీతాలే ఇవ్వండి : ఎస్టీయూ

ABN, First Publish Date - 2022-01-24T06:13:12+05:30

పాత జీతాలే ఇవ్వాలని ఎస్టీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి బైరాగిపట్టెడలోని ఎస్టీయూ భవనంలో 11వ పీఆర్సీ - ప్రభుత్వ వైఖరిపై ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న గాజుల నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), జనవరి 23: పాత జీతాలే ఇవ్వాలని ఎస్టీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి బైరాగిపట్టెడలోని ఎస్టీయూ భవనంలో 11వ పీఆర్సీ - ప్రభుత్వ వైఖరిపై ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన మాజీ కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్త పీఆర్సీతో ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని, దీనివల్ల రూ.10వేల కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. అందువల్ల కొత్త జీతాలు తమకొద్దని, పాతజీతాలనే కొనసాగించాలని కోరారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కె.ధనంజయనాయుడు మాట్లాడుతూ.. అర్ధరాత్రి విడుదల చేసిన పీఆర్సీ జీవోలను భేషరతుగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సానుకూల వాతావరణంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకుండా, మొండివైఖరి ప్రదర్శిస్తే సకల జనుల సమ్మె తప్పదని హెచ్చరించారు. కృష్ణారెడ్డి, జగన్నాథం, మురళీకృష్ణ, రుక్మాంగద, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising