ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్పవృక్ష వాహనంపై పార్వతీ తనయుడు

ABN, First Publish Date - 2022-09-19T06:14:21+05:30

: కాణిపాక ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కల్పవృక్ష వాహనంపై వినాయకస్వామి విహరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో, అర్చక, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు.

కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 18: కాణిపాక ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కల్పవృక్ష వాహనంపై వినాయకస్వామి విహరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో, అర్చక, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్‌కు పంచామృత అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ వరస రావడంతో ఆలయ అణివేటి మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను కల్పవృక్ష వాహనంపై అధిష్ఠింపచేసి పురవీధులలో ఊరేగించారు. ఆస్థాన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆయా కార్యక్రమాల్లో ఆలయ పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనరు కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు, సిబ్బంది పాల్గొన్నారు.18సీటీఆర్‌  ఐఆర్‌ఎల్‌1, 1: కాణిపాకంలో కలశ ఊరేగింపు నిర్వహిస్తున్న చైర్మన్‌, ఈవో, సిబ్బంది


వైభవంగా కలశ ఊరేగింపు

కల్పవృక్ష వాహనం సందర్భంగా ఆదివారం ఉదయం కలశ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు ఆధ్వర్యంలో అర్చక, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల కలశాలను తలపై పెట్టుకొని పురవీధుల నుంచి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొచ్చారు. అలంకార మండపం వద్ద సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. కలశ ఊరేగింపులో కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 


కాణిపాకంలో నేడు

సోమవారం స్వామికి పూలంగి సేవ నిర్వహించనున్నారు. వేలూరుకు చెందిన రాజమాణిక్యం నాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కాణిపాకానికి చెందిన కె.రాధాకృష్ణన్‌ ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. 


Updated Date - 2022-09-19T06:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising