ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీమల ఆకలి తీర్చే ఓం ప్రకాష్‌

ABN, First Publish Date - 2022-09-18T06:50:55+05:30

చీమలు పాపం నిత్య శ్రమజీవులు. ఆహారం కోసం నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. కరువు కాటకాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆహారం మోసుకుపోయి పుట్టల్లో దాచుకుంటాయి. బుచ్చినాయుడు కండ్రిగలోని చీమలకు మాత్రం ఇంత కష్టపడాల్సిన అగత్యం లేదు. తిండి కోసం ఎక్కడెక్కడో వెతుకులాడాల్సిన కష్టం లేదు. ఏకంగా తమ పుట్టల దగ్గరకే రోజూ తిన్నంత భోజనం వచ్చి పడుతోంది.

కుక్కలకు లడ్డూలు పెడుతున్న ఓం ప్రకాష్‌ - చీమలకోసం చల్లిన సజ్జ పిండి - ఓం ప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమలు పాపం నిత్య శ్రమజీవులు. ఆహారం కోసం నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. కరువు కాటకాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆహారం మోసుకుపోయి పుట్టల్లో దాచుకుంటాయి. బుచ్చినాయుడు కండ్రిగలోని చీమలకు మాత్రం ఇంత కష్టపడాల్సిన అగత్యం లేదు. తిండి కోసం ఎక్కడెక్కడో వెతుకులాడాల్సిన కష్టం లేదు. ఏకంగా తమ పుట్టల దగ్గరకే రోజూ తిన్నంత భోజనం వచ్చి పడుతోంది. ఇష్టమైన చక్కెర.. బలాన్నిచ్చే సజ్జపిండి.. అంతేనా.. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో లడ్డూలతో పసందైన విందు కూడా వీటికి లభిస్తోంది.  బుచ్చినాయుడు కండ్రిగ ఉన్నత పాఠశాలకు విశాలమైన మైదానం ఉంది. రోజూ సాయంత్రం పూట ఒక చేతి సంచితో ఆవరణలోకి అడుగు పెడతాడు ఓం ప్రకాష్‌. చీమల వేట మొదలు పెడతాడు. చక్కెర కలిపిన సజ్జపిండిని తీసి చీమల పుట్టల చుట్టూ చల్లుతాడు.లడ్లు వేస్తాడు.చీమలు ఆరగిస్తూ ఉంటే తృప్తిగా చూస్తుంటాడు.  పదిహేనేళ్లుగా చీమల ఆకలి తీరుస్తున్నాడు ఓంప్రకాష్‌. సంచితో ఓంప్రకాష్‌ని చూడగానే వీధి కుక్కలు కూడా వచ్చి చేరుతాయి. వాటి ఆకలీ తీరుస్తాడు. ఓం ప్రకాష్‌ పుట్టిన నేల రాజస్థాన్‌.ఉపాధి వెతుక్కుంటూ వచ్చి బుచ్చినాయుడు కండ్రిగలో స్థిరపడ్డాడు. మూగజీవుల ఆకలి తీర్చాకే ముద్ద తినాలన్న సంప్రదాయం ఉన్న ప్రాంతం అది. దాన్ని కొనసాగిస్తున్నాడు ఓంప్రకాష్‌. రోజూ నాలుగు కిలోల చక్కెర కలిపిన సజ్జపిండి చీమలకు పెడుతున్న ఇతను నెలకి రెండు సార్లు మూడేసి కిలోల లడ్లు చీమలకు ఆహారంగా పెడతాడు. కుక్కలకు బిస్కెట్లు, భోజనం పెట్టే ఓం ప్రకాష్‌ను స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తుంటారు. చీమలకు మాటలొస్తే మాత్రం థ్యాంక్యూ ఓంప్రకాష్‌ అని రోజూ చెబుతాయేమో! 


‘‘ మనుషులు ఆకలి అని అడిగితే ఎవరో ఒకరు ఇంత అన్నం పెడతారు. కుక్కలూ పిల్లులూ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఒక ముద్ద పెడతారు. ఆకలి అని అడగలేని చీమలూ జీవులే కదా.వాటి ఆకలి ఎవరు తీరుస్తారు?అందుకే రోజూ ఆహారం పెడుతున్నా.’’


-బుచ్చినాయుడుకండ్రిగ

Updated Date - 2022-09-18T06:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising