ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులూ... తీరు మార్చుకోండి!

ABN, First Publish Date - 2022-08-18T05:04:58+05:30

పెద్దపంజాణి ఎంపీడీవో, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్ల తీరుపై బుధ వారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపంజాణి ఎంపీడీవో,  పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌పై టీడీపీ ఫైర్‌ 


పలమనేరు, ఆగస్టు 17: పెద్దపంజాణి ఎంపీడీవో, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్ల తీరుపై బుధ వారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దపం జాణి మండలం వీరప్పల్ల్లెలో బీసీ మహిళా సర్పం చు, దళిత ఎంపీటీసీ సభ్యుడిపై వలంటీర్లు వివక్ష చూపి అవమానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చే శారు. సచివాలయ వాట్సప్‌ గ్రూపు  నుంచి వైదొ లగిన 12 మంది వలంటీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దపంజాణి ఎంపీడీవోను వారు డి మాండు చేశారు. రెండురోజుల్లోగా చర్యలు తీసుకోక పోతే తాము సచివాలయం ముందు నిరసన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక పల మనేరు మున్సిపాలిటీలో మున్సిపల్‌ కమిషనర్‌ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బాపూజీ ఉద్యానవనంలో రాత్రికి రాత్రే లక్షలాది రూపాయల విలువైన వృక్షాలను నరికి విక్రయిం చా రని ఆరోపించారు. సాధారణంగా ఎక్కడైనా  చెట్టును నరికించే అధికారం ఎవ్వరికీ వుండ దన్నారు. వాల్టా చట్టప్రకారం ముందుగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులనుంచి అనుమతులు సహా మున్సిపల్‌ సమావేశంలో ఆమోదం పొందిన తరువాత మాత్రమే చెట్లు నరికించాల్సి ఉందన్నారు.  అయితే ఇందుకు భి న్నంగా మున్సిపల్‌ కమిషనర్‌ ఒక వార్డు సభ్యుడితో చేతులు కలిపి రాత్రికిరాత్రే చెట్లు ఎలా నరికిస్తారని  ప్రశ్నించారు. ఈ విషయమై  తాము మున్సిపల్‌ కమిషనర్‌ను విచారిస్తే వేలం వేశామని, రూ.17 వేలకు దక్కించుకున్న వ్యక్తి చెట్లు నరికి తీసుకు వె ళ్లారని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దారుణ మన్నారు. దీనిపై జిల్లా అధికారులు, అటవీ, రెవె న్యూ అధికారులు వాల్టా చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. పట్టణ నడి బొడ్డున దశాబ్దాల క్రితం నాటి బాపూజీ ఉద్యానవనంలో పెంచిన చెట్టను నరికి వేసిన సం ఘటనపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌,  ఎమ్మెల్యే కూడా స్పందించాలని, లేని పక్షంలో ఈ అక్రమాల్లో వారికి కూడా సంబంధముందని భావించే అవకాశం ఉం దన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసెల్‌ నాయ కులు గిరిబాబు, నాగరాజు, చిత్తూరు పార్లమెంట్‌ మైనార్టీ అధ్యక్షులు ఖాజాపీర్‌,  బీసీ నాయకుడు సుబ్రమణ్యంగౌడు,  బ్రహ్మయ్య, లోకేష్‌ఆచారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T05:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising