ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు నిబద్ధతతో పనిచేయాలి: జడ్పీ చైర్మన్‌

ABN, First Publish Date - 2022-03-05T06:22:53+05:30

ప్రజలకు పథకాలు, సేవలు అందించడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగవరం, మార్చి 4: ప్రజలకు పథకాలు, సేవలు అందించడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు. పది రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు తప్పవన్నారు. సమావేశానికి హాజరు కాని ఆర్టీసీ, అటవీ, ఎక్సైజ్‌, ఆర్‌అండ్‌బీ సహా ఇతర అధికారులకు నోటీసులు పంపాలని ఎంపీడీవోను కోరారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ... తాగునీటి, పారిశుధ్యంతోపాటు అన్ని సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో రూ.4 లక్షలు మంజూరయ్యాయని,  నెలాఖరులోగా నిధులు వినియోగించుకోకపోతే వెనక్కు వెళ్లిపోయే ప్రమాదముందన్నారు. సమావేశంలో రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని, తాగునీటి పైప్‌లైప్‌ వేయాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కోరారు.  జడ్పీటీసీ పార్వతీచంద్రప్ప, వైస్‌ఎంపీపీ ఉమాదేవి, ఏఎంసీ చైర్మన్‌ ప్రహ్లాద, ఎంపీడీవో భాస్కర్‌, తహసీల్దార్‌ మురళి తదితరులు పాల్గొన్నారు. 


పెద్దపంజాణి: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  ఎంపీ రెడ్డెప్ప కోరారు. శుక్రవారం పెద్దపంజాణి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు  ఆయా పంచాయతీల్లో  అధికారులతో  సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలోకి అభివృద్ధి  పనులు చేపట్టాలన్నారు. జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు,  ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీపీ రెడ్డెప్ప, జడ్పీటీసీ సభ్యురాలు సుష్మాకీర్తి, తహసీల్దారు హనుమంతు, ఎంపీడీవో శివరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising