ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఆర్‌ఐ రచయిత ఔదార్యం

ABN, First Publish Date - 2022-12-30T01:21:47+05:30

తాను రాసిన పుస్తకాలపై వచ్చిన ఆదాయాన్ని టీటీడీకి విరాళంగా అందిస్తూ వస్తున్న ఎన్‌ఆర్‌ఐ వెంకట వినోద్‌ పరిమి గురువారం ‘దైవమీమాంస’ అనే పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు విడుదల చేశారు.

దైవమీమాంస పుస్తకంతో వెంకట వినోద్‌ పరిమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోసంరక్షణ ట్రస్టుకు వితరణగా పుస్తక విక్రయాల ఆదాయం

తిరుమల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):తాను రాసిన పుస్తకాలపై వచ్చిన ఆదాయాన్ని టీటీడీకి విరాళంగా అందిస్తూ వస్తున్న ఎన్‌ఆర్‌ఐ వెంకట వినోద్‌ పరిమి గురువారం ‘దైవమీమాంస’ అనే పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు విడుదల చేశారు. విశాఖ జిల్లా వడ్డాది గ్రామానికి చెందిన వినోద్‌ ఉద్యోగరీత్యా సింగపూర్‌లో స్థిరపడ్డారు.వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన వినోద్‌ నెలకోసారి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. తిరుమలలో పాటు దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించే వినోద్‌ తన ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభవాలతో ‘దైవంతో నా అనుభవాలు’ అనే పుస్తకాన్ని స్నేహితుడు విజయనగరంలోని నెలిమర్లకు చెందిన రమే్‌షకుమార్‌ సహాయంతో 2020లో రాశారు.దాదాపు 2,500 పుస్తకాలు అమ్ముడవడంతో వచ్చిన ఆదాయాన్ని టీటీడీ గోసంరక్షణ ట్రస్టుకు అందజేశారు. 2021లో ఆ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించగా వెయ్యి పుస్తకాలు అమ్ముడయ్యాయి.అదే ఏడాది ‘దైవంతో నా అనుభవాలు పార్ట్‌-2’ విడుదల చేశారు. అవి కూడా దాదాపు 1,500 పుస్తకాలు అమ్ముడయ్యాయి.కొందరు పాఠకులు వి నోద్‌ రాసిన పుస్తకాల్లో సం దేహాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.దీంతో ‘దైవ మీమాంస, ఆధ్యాత్మిక సందేహాలు-సమాధానాలు’ అనే పేరుతో మరో పుస్తకాన్ని రాసి గురువారం తిరుమలలో విడుదల చేశారు.పుస్తకాల విక్రయం ద్వారా వచ్చిన రూ.3 లక్షలను ఇప్పటికే టీటీడీ గోసంరక్షణ ట్రస్టుకు అందజేశానని వినోద్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలతో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తూ శ్రీవారికి సేవచేస్తానని తెలిపారు.

Updated Date - 2022-12-30T01:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising