ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు

ABN, First Publish Date - 2022-08-17T06:26:56+05:30

చిత్తూరు కలెక్టర్‌ సహా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 16: చిత్తూరు కలెక్టర్‌ సహా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు మండలం చెర్లోపల్లెలో పేదలకు ఇంటి స్థలాల కోసం 2004లో రెవెన్యూ అధికారులు స్థలాన్ని గుర్తించారు. చెర్లోపల్లెకి చెందిన రమణారెడ్డి నుంచి ఆ 82 సెంట్ల స్థలాన్ని సేకరించారు. అప్పటి నుంచి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, నిర్మాణాలు చేపట్టలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భూమిని పరిశీలించినా, ఇళ్లస్థలాలకు కేటాయించలేదు. బెంగళూరు- తిరుపతి హైవేకి ఆనుకొని ఉన్న విలువైన భూమి కావడంతో ఓ ప్రజాప్రతినిధి కన్ను దీనిపై పడింది.  క్వారీ లీజు పేరుతో అనుమతులు ఇవ్వాలని ఆ ప్రజాప్రతినిధి దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు అనుమతిచ్చారు. ఇంటి పట్టాల కోసం తీసుకున్న స్థలాన్ని క్వారీకి కేటాయించడంపై రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన పరిహారాన్ని తిరిగి ఇచ్చేస్తానని, ఆ 82 సెంట్లను తిరిగి అప్పగించాలని కోరుతూ లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చాయి. 


Updated Date - 2022-08-17T06:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising