ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలపై పర్యవేక్షణ ఏదీ!

ABN, First Publish Date - 2022-06-26T06:06:31+05:30

కుప్పంలో సంప్రదాయేతర పంటలు సాగవుతుంటాయి. అయితే సరైన పర్యవేక్షణ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ సమయానికి ఈ మందు ఎంత మోతాదులో వేయాలి, ఎంత మేర నీళ్లు వదలాలి తదితర అంశాలను రైతులు వారికి నారు సరఫరా చేసిన ప్రైవేటు వ్యక్తులమీదే ఆధారపడి చేస్తుంటారు.

కుప్పం మండలంలో ఎరువు వేసే సమయంలో వాన జల్లులు కురవడంత వాడిపోయినట్లుగా అయిపోయిన క్యాబేజీ పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, జూన్‌ 25: కుప్పంలో సంప్రదాయేతర పంటలు సాగవుతుంటాయి. అయితే సరైన పర్యవేక్షణ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ సమయానికి ఈ మందు ఎంత మోతాదులో వేయాలి, ఎంత మేర నీళ్లు వదలాలి తదితర అంశాలను రైతులు వారికి నారు సరఫరా చేసిన ప్రైవేటు వ్యక్తులమీదే ఆధారపడి చేస్తుంటారు. ఒక్కోసారి సొంత పరిజ్ఞానంతో ఆ పనులు చేసి దెబ్బ తింటుంటారు. ఉదాహరణకు కుప్పం నియోజకవర్గవ్యాప్తంగా రైతులు ఏళ్ల తరబడి క్యాబేజీ సాగు చేస్తున్నా  రసాయనిక ఎరువులు, మందులు ఎక్కువగానో లేక తక్కువగానో వాడి ఈ సారీ దెబ్బతిన్నారు.  అప్పుడప్పుడూ కురుస్తున్న వర్షాలకు  ఎరువు అంతా నేరుగా మొక్కలోకి పోయి పంట తీవ్రంగా దెబ్బతింటోంది.  క్యాబేజీ పంటకు చల్లిన ఎరువు వాన కురవడంవల్ల పక్వానికి వచ్చిన పంట ఽపురుగు తిన్నట్లుగా అయిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. అంతేకాక ఎరువులు చల్లాల్సిన మోతాదు తెలియకపోవడంవల్ల నష్టపోతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నిరంతరం గ్రామ పర్యటనలు చేస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తే ఇటువంటి నష్టాలను నివారింవచ్చు. అయితే రైతులు కూడా ప్రైవేటు వ్యాపారులు, మందులు, ఎరువుల దుకాణాలవాళ్ల సలహాలు తీసుకోవడానికే అధికంగా ఆసక్తి చూపడంవల్ల కూడా నష్టపోవాల్సి వస్తోంది.



Updated Date - 2022-06-26T06:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising