ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి రాత్రికే నింగిలోకి

ABN, First Publish Date - 2022-10-22T07:14:27+05:30

ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి నేటి అర్ధరాత్రి తర్వాత 12.07గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశంలో (ఎంఆర్‌ఆర్‌) శాస్త్రవేత్తలు ప్రకటించారు.

రాకెట్‌ చివరిభాగంలో అమర్చిన ఉపగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ 

-ప్రారంభమైన కౌంట్‌డౌన్‌  

సూళ్లూరుపేట, అక్టోబరు 21: ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి నేటి అర్ధరాత్రి తర్వాత 12.07గంటలకు  జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ ప్రయోగానికి  సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశంలో (ఎంఆర్‌ఆర్‌) శాస్త్రవేత్తలు ప్రకటించారు.లాంచింగ్‌ ఆఽథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.ఈ రాకెట్‌ ద్వారా యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శుక్రవారం రాత్రి  12.07గంటలకు ప్రారంభమైంది.24గంటల తరువాత అంటే శనివారం అర్ధరాత్రి 12.07గంటలకు రాకెట్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది.ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శుక్రవారమే షార్‌కు చేరుకుని శాస్త్రవేత్తలతో కలసి ప్రయోగ వేదికపై ఉన్న జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను పరిశీలించారు. అనంతరం డాక్టర్‌ బీఎన్‌.సురేష్‌ అధ్యక్షతన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం(ఎంఆర్‌ఆర్‌) జరిగింది. ఈ సమావేశంలో ఇస్రో చైర్మన్‌ కూడా పాల్గొని ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు.జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా విదేశీ ఉపగ్రహాలు పంపడం  ఇదే తొలిసారి కావడంతో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలూ తీసుకొంటున్నారు. 5టన్నుల బరువు గల యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఒక్కొక్కటిగా విడిచిపెట్టనుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన తరువాత గ్రౌండ్‌ స్టేషన్‌ అందుబాటులో లేకపోవడంతో శాస్త్రవేత్తలు సముద్రంలో ఓడలో తాత్కాలికంగా గ్రౌండ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసుకొన్నారు. అక్కడ నుంచి ఉప్రగహాలను నియంత్రించే వ్యవస్థను కల్పించుకున్నారు. ప్రయోగాన్ని పర్యవేక్షిందుకు యూకే శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకొన్నారు. 


Updated Date - 2022-10-22T07:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising