ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గడపగడప’లో నిలదీతలు

ABN, First Publish Date - 2022-07-02T06:45:29+05:30

‘గడపగడప’లో భాగంగా డీఎంపురంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని గ్రామస్తులు నిలదీశారు.

గ్రామస్తులతో మాట్లాడుతున్న నారాయణస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి):  గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కార్వేటినగరం మండలంలోని డీఎంపురం గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు పెద్ద బుడ్డయ్య తన సమస్యలపై నారాయణస్వామిని గట్టిగా నిలదీశారు. అదే గ్రామానికి చెందిన సుబ్బమ్మ తనకు రూ.1.18 లక్షల కరెంటు బిల్లు వచ్చిందని, ఈ కారణంగా అమ్మఒడి, రైతు భరోసా పథకాల లబ్ధి దూరమైందని నారాయణస్వామి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన స్పందించి అధికారులతో మాట్లాడారు. వెంటనే విద్యుత్తు మీటరు మార్చాలని, ఆయా పథకాల లబ్ధి అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. డ్రైనేజీ కాలువపైన మూత వేయకుండా వదిలేయడంతో దోమలతో ఇబ్బందిగా ఉందని, చిన్న పిల్లలు కూడా ఆ కాలువలో పడిపోతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ఫిర్యాదు చేయగా రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని నారాయణస్వామి హామీనిచ్చారు.

Updated Date - 2022-07-02T06:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising