ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగమ్మ ఆలయంవద్ద తప్పిపోయిన బాలుడు

ABN, First Publish Date - 2022-05-18T08:11:20+05:30

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద సోమవారం రాత్రి నాలుగేళ్ల బాలుడు తప్పిపోయాడు.

తప్పిపోయిన రంగస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(నేరవిభాగం), మే 17: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద సోమవారం రాత్రి నాలుగేళ్ల బాలుడు తప్పిపోయాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ ప్రకా్‌షకుమార్‌, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రామాంజనేయపురానికి చెందిన పరశురాం, రేణుక దంపతులు రాగి ఉంగరాలు, తదితరాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. జాతర సందర్భంగా గంగమ్మ ఆలయం వద్ద వ్యాపారం చేయడానికి తమ కుమారుడు రంగస్వామి (4)ని తీసుకుని ఏడ్రోజుల కిందట తిరుపతికి వచ్చారు. సోమవారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో వర్షం పడటంతో ఆలయ సమీపంలోని వెటర్నరీ వైద్యశాల పక్కనే మూసిఉన్న ఓ దుకాణం వద్ద ముగ్గురూ తలదాచుకున్నారు. వర్షం తగ్గాక భోజనం పార్శిల్‌ తీసుకురావడానికి పరశురాం గ్రూప్‌ థియేటర్స్‌ వద్దకెళ్లాడు. కొంతసేపటికి పక్కనే ఉండాల్సిన బిడ్డ కనిపించక పోవడంతో రేణుక పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. తిరిగొచ్చిన పరశురాం కూడా విషయం తెలుసుకుని చుట్టూ ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. బాలుడిని ఓ వృద్ధుడు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రికి కూడా బాలుడి ఆచూకీ తెలియలేదని ఈస్ట్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-05-18T08:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising