ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: తిరుమలలో రూల్స్ బ్రేక్ చేసిన మంత్రి రోజా..

ABN, First Publish Date - 2022-08-18T21:42:48+05:30

తిరుమలలో మంత్రి రోజా (Minister Roja) రూల్స్ బ్రేక్ (Break the rules) చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (Tirupathi): తిరుమలలో మంత్రి రోజా (Minister Roja) రూల్స్ బ్రేక్ (Break the rules) చేశారు. టీటీడీ (TTD) దర్శనాల నిబంధనలను పాటించలేదు. తన అనుచరులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. రద్దీ సమయంలో బ్రేక్ దర్శనాలకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. దీంతో మంత్రి రోజా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దర్శనం కల్పించాల్సిందేనని పట్టుపడుతూ.. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. 


ఇప్పుడు కుదరదని అధికారులు చెప్పడంతో మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, తన అనుచరులకు దర్శనం కల్పించాల్సిందేనన్నారు. చివరికి చేసేదిలేక టీటీడీ అధికారులు వారికి దర్శనం కల్పించారు. రోజా ఆలయంలోనే ఉండి తన అనుచరులకు దర్శనం కల్పించారు. దాదాపు రెండు గంటలకుపైగా ఆలయంలోనే ఉన్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజాను ఇంతసేపు ఎంటని అడగ్గా చెప్పుకుంటే బాధ అంటూ టీటీడీపై అసహనం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కనుక.. తన నియోజకవర్గం ప్రజలకు దర్శనం అయ్యేవరకు ఆలయంలోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.


అయితే మంత్రి రోజా తన అనుచరులకు బ్రేక్ దర్శనం కల్పించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమయంలో వీఐపీ దర్శనాలు చేయించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-08-18T21:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising