ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడసారి కష్టాలు

ABN, First Publish Date - 2022-01-19T06:05:32+05:30

మృతదేహాలను మోస్తూ స్వర్ణముఖి నది ఏరును దాటేందుకు ఎండీపుత్తూరు గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.

నది నీటిలో మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, జనవరి 18: ఫొటోలో పాడెమోస్తున్న వారందరూ ఏర్పేడు మండలం ఎండీపుత్తూరు చెందిన మునెమ్మ(70) బంధువులు. సోమవారం ఆమె చనిపోవడంతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇలా నీళ్లలో పాట్లు పడుతూ వెళ్తున్నారు. గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురవడం సమస్యగా మారింది. దీనిపై గతంలో ఫిర్యాదులందగా రెవెన్యూ సిబ్బంది భూ సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎవరైనా గ్రామస్థులు మృతిచెందితే మార్గమధ్యంలోని స్వర్ణముఖి నది ఏరును దాటి ఆవలనున్న ప్రభుత్వ స్థలంలో మృతదేహాలను పూడ్చిపెట్టాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇదే మండలం పాపానాయుడుపేట నుంచి ఎండీపుత్తూరు మీదుగా వరదనీరు శ్రీకాళహస్తి వద్ద ఉన్న స్వర్ణముఖి నదికి చేరుతున్నాయి. అయితే ఇప్పటికీ నీటి ప్రవాహం తగ్గక పోవడంతో మెడలోతు నీళ్లల్లో అవస్థలు పడుతూ ఆప్తుల మృతదేహాలను తీసుకువెళుతూ గ్రామస్థులు ఏరును దాటాల్సి వస్తోంది. ఈ సందర్భంగా సర్పంచ్‌ మోహనప్రియ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులతో చర్చించి ఆక్రమితస్థలంలో శ్మశాన వాటిక ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కాగా, రెవెన్యూ యంత్రాంగం సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన నిర్వహిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-19T06:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising