ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళారీ వ్యవస్థ లేకుండా మార్కెట్‌ చేసుకోండి

ABN, First Publish Date - 2022-05-28T05:52:08+05:30

రైతులు తాము పండించిన పంటల విక్రయానికి దళారీలను సంప్రదించకుండా మార్కెట్‌ చేసుకొనే దిశగా అడుగులు వేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీనివాసులు సూచించారు.

పలమనేరు ఉద్యానవన శాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, మే 27: రైతులు తాము పండించిన పంటల విక్రయానికి దళారీలను సంప్రదించకుండా మార్కెట్‌ చేసుకొనే దిశగా అడుగులు వేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం పలమనేరు ఉద్యాన శాఖ కార్యాలయంలో పలమనేరు, గంగవరం మండల రైతు ఉత్పత్తిదారుల సంఘ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పండ్లు, కూరగాయల సేకరణ కేంద్రం, శీతల గిడ్డంగులకు ఉద్యాన శాఖ 75 శాతం రాయితీ అందిస్తుందని తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరమైన ఖర్చులో 90 శాతం వరకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మౌలిక వసతుల నిధినుంచి రుణం పొందవచ్చన్నారు. సకాలంలో నెలవారి వాయిదాల చెల్లింపు చేసిన రైతు సంఘాల రైతులకు వడ్డీపై 3శాతం రాయితీ ఇస్తారన్నారు. రైతు సంఘాల నిర్వహణకు రెండు సంవత్సరాల పాటు రివాల్వింగ్‌ ఫండ్‌ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీప్రసన్న, రైతు ఉత్పత్తిదారుల సంఘ ప్రతినిధులు సునంద, హరి, మనోజ్‌, కుమార్‌, వెంకటరమణ, సుబ్రమణ్యంరెడ్డి, సీఈవోలు వాణి, రాజేష్‌ తదతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising