ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mandus Effect.. భారీగా నష్టపోయిన చిత్తూరు జిల్లా రైతులు

ABN, First Publish Date - 2022-12-12T11:55:51+05:30

మాండస్ తుపాను (Mandus Cyclone) ఎఫెక్టు చిత్తూరు జిల్లాపై భారీగా పడింది. తమిళనాడు (Tamilnadu) సరిహద్దు మండలాల్లో పంటలకు సంబంధించి అపార నష్టాన్ని కలగజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: మాండస్ తుపాను (Mandus Cyclone) ఎఫెక్టు చిత్తూరు జిల్లాపై భారీగా పడింది. తమిళనాడు (Tamilnadu) సరిహద్దు మండలాల్లో పంటలకు సంబంధించి అపార నష్టా

న్ని కలగజేసింది. వరి, చెరకు, నిమ్మ, మామిడి, అరటి, వేరుశనగ పంటలు పూర్తిగా నీటమునిగాయి. పంటపొలాల్లోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుపాను తిమిళనాడుతోపాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. జిల్లాలో విజయపురి మండలం, నిండ్ర, పుత్తూరు, నగిరి, ఎస్ఆర్ పురం, తమిళనాడు, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా వేరుశనగ రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దొరవారి సత్రం మండలంలో సుమారు 1500 ఎకరాలు, తడ మండలంలో 1080 ఎకరాలు, నాయుడుపేట మండలంలో 350 ఎకరాలు జలమయమైనట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది.

Updated Date - 2022-12-12T11:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising