ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవులకు ‘లుంపి స్కిన్‌’ వ్యాధి

ABN, First Publish Date - 2022-09-17T05:50:13+05:30

గంగాధరనెల్లూరు మండలం ఆత్మకూరు, వేల్కూరు పంచాయతీల పరిధిలో ఆవులకు కొత్తగా లుంపి స్కిన్‌ వ్యాధి సోకినట్లు వెటర్నరీశాఖ ఏడీ డాక్టర్‌ మురళీ మోహన్‌ తెలిపారు.

లుంపి స్కిన్‌ వ్యాధికి గురైన ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడిరైతులు అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ ఏడీ సూచన 

గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 16: గంగాధరనెల్లూరు మండలం ఆత్మకూరు, వేల్కూరు పంచాయతీల పరిధిలో ఆవులకు కొత్తగా లుంపి స్కిన్‌ వ్యాధి సోకినట్లు వెటర్నరీశాఖ ఏడీ డాక్టర్‌ మురళీ మోహన్‌ తెలిపారు. ఈ క్రమంలో పాడిరైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు. 

వ్యాధి లక్షణాలు

వైర్‌స(కాఫ్రిఫాక్స్‌) వలన ఈ వ్యాధి వస్తుంది. ఆవులు, గేదెలలో వ్యాపిస్తుంది.

దోమలు, ఈగలతో పాటు మగ పిడుదుల వలన ఈ వ్యాధి విస్తృతం అవుతుంది.

ఆవులు, గేదెలకు అధికజ్వరం వస్తుంది. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. మేత తినలేవు. లింఫ గ్రంథుల వాపు, కళ్ళుకారి మందగించడం, నాలుగు కాళ్ళల్లోనూ వాపు ఉంటుంది. శరీరం మొత్తంపై బుడిపెలు ఏర్పడి.. అనంతరం అవి పుండ్లుగా మారి రక్తం కారుతుంది. 

నివారణకు జాగ్రత్తలు

ఆవుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వెటర్నరీ డాక్టర్లకు పాడిరైతులు తెలియజేయాలి.

ప్రస్తుతం పాడిరైతులు  పశువులను కొనుగోలుచేయడం-అమ్మడం వంటి పనులు కొద్దిరోజులు మానుకోవాలి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సంతలలో పాడిఆవులు కొనుగోలు చేయకూడదు. 

వ్యాధి వచ్చిన గ్రామాలయందు వెంటనే పిడుదల మందు పిచికారి చేయించుకోవాలి. గోట్‌ఫాక్స్‌ వ్యాక్సిన్‌ని వేయించాలి. 

ఆయుర్వేదిక్‌ లేపనాలు, యాంటీబయెటిక్స్‌. అనాల్‌జెసిక్స్‌. మందులు వినియోగించాలి.

తమిళనాడు సరిహద్దులో ఉన్న గంగాధరనెల్లూరు మండలంలో పాతవెంకటాపురం, కొత్తవెంకటాపురం పంచాయతీల్లో 254 పశువులకు, పాలసముద్రం మండలంలో 1200 పశువులకు ముందస్తుగా టీకాలు వేశారు. 


Updated Date - 2022-09-17T05:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising