ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు

ABN, First Publish Date - 2022-01-22T07:00:00+05:30

హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(లీగల్‌), జనవరి 21: వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్న తన సహచరుడిని హత్య చేసిన కేసులో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా తిరువట్టియూర్‌కలాడిపేట రాజీవ్‌నగర్‌కు చెందిన కె.నటరాజన్‌కు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధించారు. ఈ మేరకు మూడో అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు శుక్రవారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ ఆఫీసర్‌ ఎ.వెంకటనారాయణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం రామచంద్రయ్యకాలనీలో సి.ఉమాపతినాయుడు వెల్డింగ్‌షాపు నిర్వహించేవాడు. ఇతడి వద్ద సురేష్‌, నటరాజన్‌ పనిచేసేవారు. 2020 జూన్‌ 13వ తేదీ సాయంత్రం వీరిద్దరూ మద్యం తాగి ఘర్షణకు దిగారు. రాత్రి ఎప్పటిలానే ఇద్దరూ ఓ గదిలో నిద్రించారు. సురేష్‌ నిద్రలోకి జారుకోగానే నటరాజన్‌ ఇనుపరాడ్‌తో తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయమవడంతో సురేష్‌ దుర్మరణం చెందాడు. వెల్డింగ్‌ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం నిరూపణ కావడంతో నిందితుడికి న్యాయమూర్తి శిక్ష విధించగా, లైజనింగ్‌ ఆఫీసర్‌ మునిరత్నంనాయుడు తిరుపతి సబ్‌జైలుకు తరలించారు. 

Updated Date - 2022-01-22T07:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising