ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

ABN, First Publish Date - 2022-07-04T06:18:11+05:30

దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాజీ బ్రిగేడియర్‌ రాజీవ్‌ మీనన్‌ అన్నారు.

మాజీ సైనికుల కుటుంబసభ్యులనుద్ధేశించి ప్రసంగిస్తున్న మాజీ సైనిక అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ బ్రిగేడియర్‌ రాజీవ్‌ మీనన్‌

చిత్తూరు, జూలై 3: దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాజీ బ్రిగేడియర్‌ రాజీవ్‌ మీనన్‌ అన్నారు. ఆదివారం స్థానిక బైపాస్‌ రోడ్డులోని బ్యాన్స్‌ హోటల్‌లో 28 మద్రాసు రెజిమెంట్‌ మాజీ సైనికుల 46వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన సైనికాధికారులు, మాజీ బ్రిగేడియర్‌ రాజీవ్‌మీనన్‌, కల్నల్‌ రాయ్‌, కల్నల్‌ శ్రీకుమార్‌ మాట్లాడుతూ 46 సంవత్సరాలుగా ఏటా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది చిత్తూరులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 28 మద్రాసు రెజిమెంట్‌లో వివిధ పోరాటాల్లో అమరులైన 66 మంది వీరసైనికులను స్మరించుకోవాలన్నారు. దేశ భద్రతలో క్రియాశీలకంగా ఉంటున్న సైనికులు జాతీయ, కామన్‌ వెల్త్‌ పోటీల్లోనూ పతకాలు సాధించారని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ సైనికులు దేశానికి చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T06:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising