ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టాల్లో కుప్పం టౌన్‌ బ్యాంక్‌

ABN, First Publish Date - 2022-03-05T06:19:33+05:30

కుప్పం పట్టణ సహకార బ్యాంకు (టౌన్‌బ్యాంక్‌) నష్టాల్లో ఉందని జిల్లా సహ కార శాఖ అధికారి (డీసీవో) తెలిపారు. రుణ బకా యిల వసూళ్లకు, గతంలో అవినీతి చర్యలతో గోల్‌ మాల్‌ అయిన రూ.2 కోట్ల నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు

కుప్పం టౌన్‌ బ్యాంకులో రికార్డులు తనిఖీ చేస్తున్న డీసీవో చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బకాయిల రికవరీకి చర్యలు : డీసీవో  


కుప్పం, మార్చి 4: కుప్పం పట్టణ సహకార బ్యాంకు (టౌన్‌బ్యాంక్‌) నష్టాల్లో ఉందని జిల్లా సహ కార శాఖ అధికారి (డీసీవో) తెలిపారు.  రుణ బకా యిల వసూళ్లకు, గతంలో అవినీతి చర్యలతో గోల్‌ మాల్‌ అయిన రూ.2 కోట్ల నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పం టౌన్‌బ్యాంకులో గత  పదిహేను రోజులుగా ఉద్యోగుల మధ్య, అలాగే ఉద్యోగులకు, పాలకమండలికి మధ్య వివాదం నడు స్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మేనేజరుగా ఉన్న శివకు, పాలకమండలి త్రిసభ్య పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీ చైర్మన్‌ భాగ్యరాజ్‌కు మధ్య మొదలైన వివా దం తారస్థాయికి చేరింది. గతంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌ అంశంలో ఉద్వాసనకు గురైన ఇద్దరు మ హిళలను ఇటీవల బ్యాంకులో తిరిగి తాత్కాలికంగా ఉద్యోగంలోకి తీసుకోవడమేకాక, వారిలో ఒకరికి మేనే జరు కుర్చీ కట్టబెట్టాలన్న ఉద్దేశం చైర్మన్‌ది కాగా, ఎలాగైనా పదవిలోనే కొనసాగాలన్నది శివ ఉద్దేశం అని, దీంతో ఘర్షణ నెలకొన్నదని బ్యాంకు ఉద్యోగ వర్గాలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో డీసీవో చంద్ర శేఖర్‌రెడ్డి శుక్రవారం కుప్పం టౌన్‌బ్యాంకులో త నిఖీకి వచ్చారు. రికార్డులకు పరిశీలించారు. రెండేళ్ల క్రితం జరిగిన రూ.2 కోట్ల గోల్‌మాల్‌ విషయంలో బాధ్యులుగా తేలిన వారినుంచి రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు. అప్పట్లో మేనేజరుగా ఉండి,  ఉద్వాసనకు గురైన నవీన్‌ ఇటీవల మృతి చెందారని, ఆయన ఆస్తులను వేలం వేసి రూ.48 లక్షలు రాబ ట్టుకుంటామన్నారు. బ్యాంకుకు సంబంధించి రూ.4 కోట్ల రుణ బకాయిలు పేరుకుపోయాయని, అవి వ సూలు కాకపోవడంవల్లే బ్యాంకు నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. రుణ గ్రహీతలకు నోటీసులు జారీ చేసి, అప్పటికీ స్పందించపోతే ఆస్తుల వేలం వేస్తా మన్నారు. బ్యాంకులో ఉద్యోగులు, పాలక మండలి మధ్య నెలకొన్న వివాదంపై స్పందిస్తూ... ప్రస్తుతం  పనిచేస్తున్నది తాత్కాలిక ఉద్యోగులేనని, ఇటీవల సీఈవోగా నియమితులైన సురేశ్‌బాబునే ఇన్‌చార్జి మేనేజరుగా వ్యవహరించేలా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. 

Updated Date - 2022-03-05T06:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising