ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీలేరు కాటమరాజు ఉత్సవాల సందడి

ABN, First Publish Date - 2022-01-17T07:01:39+05:30

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం పీలేరులో సందడిగా కాటమరాజు ఉత్సవాలను నిర్వహించారు.

పీలేరులో చిట్లాకుప్ప ఉత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, జనవరి 15: సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం పీలేరులో సందడిగా కాటమరాజు ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ సమీపంలోని కామాటంవారిపల్లె వద్ద జరిగిన కనుమ ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైన పశువులతో రైతులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా మ్యూజికల్‌ చైర్స్‌, పతంగుల పోటీలు నిర్వహించారు. విజేతలతోపాటు, పశువుల అలంకరణకూ నిర్వాహకులు ప్రత్యేక బహుమతులిచ్చి అభినందించారు. కాగా, ఉదయమే పశువులను రైతులు రంగురంగుల పూలతో అలంకరించి తిరుపతి-మదనపల్లె మార్గంలోని కామాటంవారిపల్లె వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన చిట్లాకుప్ప చుట్టూ పశువులు, గోవులను ప్రదక్షిణ చేయించారు. కట్టుకాలువ వీధిలోని చిట్లాకుప్ప వద్దకూ వేలాది పశువులతో జనం తరలి వచ్చారు. దీంతో కలికిరి-తిరుపతి మార్గం రద్దీగా మారడంతో, ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-01-17T07:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising