వరసిద్ధుడి సేవలో కరణం మల్లీశ్వరి
ABN, First Publish Date - 2022-01-09T05:24:00+05:30
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి శనివారం దర్శించుకున్నారు.
వరసిద్ధుడి ఆలయంలో కరణం మల్లీశ్వరి
ఐరాల(కాణిపాకం), జనవరి 8: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి శనివారం దర్శించుకున్నారు. ఆమెకు ఈవో వెంకటేశు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బెన్నరాజ, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్, కిషోర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-09T05:24:00+05:30 IST