AP News: వరసిద్ధుడికి ఇచ్చిన బంగారు విభూదిపట్టిని అర్చకుడు ఏం చేశాడంటే...
ABN, First Publish Date - 2022-10-29T09:54:23+05:30
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కానిపాకం ఆలయంలో డొల్లతనం బయటపడింది.
చిత్తూరు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కానిపాకం ఆలయం (Kanipakam temple)లో డొల్లతనం బయటపడింది. స్వామివారికి ఓ భక్తుడు ఇచ్చిన బంగారు విభూదిపట్టిని ఓ అర్చకుడు తన వద్ద ఉంచుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. విభూదిపట్టిని విరాళంగా ఇచ్చిన దాత రసీదు కోరడంతో అసలు విషయం బయటపడింది. కాణిపాకంలో మహా కుంభాభిషేకం సందర్భంగా వేలూరుకు చెందిన ఓ భక్తుడు వెండి విభూదిపట్టిని వరసిద్ధునికి విరాళంగా అందించారు. దాన్ని అర్చకుడు అధికారులకు అప్పగించకుండా తన వద్దే నెల రోజులు ఉంచుకున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన దేవదాయ శాఖ... ఈ ఘటనకు సంబంధించి కమిటీ వేసి విచారణకు ఆదేశించింది.
Updated Date - 2022-10-29T09:56:14+05:30 IST