ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం...కల్యాణం

ABN, First Publish Date - 2022-03-05T07:26:38+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువజామున ఆదిదంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ఆదిదంపతుల వివాహ ఘట్టం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శోభిల్లిన శ్రీకాళహస్తి

తరలివచ్చిన భక్తులు

ఒక్కటైన 48 జంటలు


శ్రీకాళహస్తి, మార్చి 4:శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువజామున ఆదిదంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.గురువారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరుడిని, జ్ఞానప్రసూనాంబ దేవిని స్వర్ణాభరణాలతో అలంకరించి పూజలు నిర్వహించారు.స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై అధిష్టింపజేసి మంగళవాయిద్యాలు, మేళతాళాలు... కళాకారుల ఆటలు, పాటల మధ్య పెండ్లిమండపం వద్దకు తీసుకొచ్చారు. పెండ్లిమండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరుకోగా మధ్యలో పార్వతీదేవి అలకబూనారు. చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం నిర్వహించి అలక తీర్చడంతో పార్వతీదేవి పెండ్లిమండపం వద్దకు చేరుకుని పెళ్లిపీటలపై ఆశీసునలయ్యారు. పూజల అనంతరం వేదపండితులు కల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు. ఇదే ముహూర్తంలో 48జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరపున మంగళసూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు.శివపార్వతుల కల్యాణం వీక్షించడానికి తరలివచ్చిన భక్తజనంతో  నగరివీధి, నెహ్రూవీధి నిండిపోయాయి.ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ధర్మకర్తలమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఈవో పెద్దిరాజు, సూపరింటెండెంట్‌ విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆదిదంపతులు రుద్రాక్ష చప్పరాలపై పురవిహారం చేశారు.రాత్రి సభాపతి కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది.శనివారం కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు.కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలకు, మునులకు వీడ్కోలు పలికేందుకు స్వామిఅమ్మవార్లు ఈ ప్రదక్షిణకు వెళ్లనున్నారు.





Updated Date - 2022-03-05T07:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising