ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 నుంచి కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-01-22T07:03:39+05:30

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీవరకు నిర్వహించనున్నారు.

కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏకాంతంగా నిర్వహిస్తామన్న టీటీడీ


చంద్రగిరి, జనవరి 21: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీవరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను కొవిడ్‌ నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, శాస్త్రోక్తంగా నిర్వహించి, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 20న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం, 21న ఉదయం హంస వాహనం, రాత్రి చిన్నశేష వాహనం, 22న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనం, 23న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 24న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గరుడ వాహనం, 25న ఉదయం తిరుచ్చి, గజ వాహనం, రాత్రి హనుమంతు వాహనం, 26న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్ర ప్రభవాహనం, 27న ముత్యపు పందిరి వాహనం, రాత్రి అశ్వ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 28న ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా రోజూ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలవరకు స్వామివార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు. గరుడ సేవ మాత్రం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు జరుగుతుంది. 

Updated Date - 2022-01-22T07:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising