ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకంలో కలశ ఊరేగింపు

ABN, First Publish Date - 2022-08-18T06:26:48+05:30

కాణిపాకంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం కార్యక్రమంలో మూడో రోజైన బుధవారం కలశ ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు.

హారతి ఇస్తున్న అర్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 17: కాణిపాకంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం కార్యక్రమంలో మూడో రోజైన బుధవారం కలశ ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కలశాన్ని ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మాడ వీధులలో ప్రదక్షణగా వరసిద్ధుడి ఆలయానికి తీసుకొచ్చారు. యాగశాలలో పూజలలో కొలువుదీర్చారు. ఆలయ యాగశాలలో ఉదయం 7 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, కలశారాధన, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గణపతిపూజ, పుణ్యాహవచనం, అనుజ్ఞ, ప్రవేశబలి, రక్షోఘ్నహోమం, వాస్తు శాంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఈఈ  వెంకటనారాయణ, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకారవి, గుత్తికొండశ్రీనివాస్‌, వారికుటుంబ సభ్యులు, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising