కైలాససదన్ ప్రారంభం
ABN, First Publish Date - 2022-10-07T05:51:38+05:30
శ్రీకాళ హస్తీశ్వ రాలయ ఆధ్వర్యంలో భర ద్వాజ తీర్థంలో నిర్మించిన కైలా ససదన్ కాటేజీని బుధ వారం తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు.
శ్రీకాళహస్తి, అక్టో బరు 6: శ్రీకాళ హస్తీశ్వ రాలయ ఆధ్వర్యంలో భర ద్వాజ తీర్థంలో నిర్మించిన కైలా ససదన్ కాటేజీని బుధ వారం తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. వారికి శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులు బస చేసేందుకు కైలాససదన్‌ను ప్రారంభిం చామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. ఎంపీ గురుమూర్తి సహకారంతో భక్తకన్నప్ప కొండ నుంచి దుర్గమ్మ కొండకు రోప్‌వే నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరయ్యాన్నారు. త్వరలో రోప్‌వే నిర్మాణం చేపడుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి, ఎస్సీవీ దిలీప్, వైసీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T05:51:38+05:30 IST