ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

ABN, First Publish Date - 2022-06-04T07:06:14+05:30

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు  జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు.ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసేవేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత  వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు.  రెండవరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు ఏడాది పొడవునా శ్రీవారు ఈ బంగారు కవచంతోనే ఉంటారు. 

Updated Date - 2022-06-04T07:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising